- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు ఈ-డీలక్స్ సర్వీసులు
దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా ఈ-డీలక్స్ (ఎలక్ట్రిక్) బస్సులను ప్రారంభించినట్లు దేవరకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు.

దిశ, దేవరకొండ టౌన్: దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా ఈ-డీలక్స్ (ఎలక్ట్రిక్) బస్సులను ప్రారంభించినట్లు దేవరకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు. సోమవారం ఈ నూతన బస్సులను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. దేవరకొండ-హైదరాబాద్ రూట్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా 4 ఈ-డీలక్స్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ బస్సులకు సంబంధించి దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు రూ.170.00, కొండమల్లేపల్లి నుంచి రూ.160.00 చార్జీలు వర్తిస్తాయని డిపో మేనేజర్ స్పష్టం చేశారు. అయితే, ఈ ఈ-డీలక్స్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే "మహాలక్ష్మి పథకం" వర్తించదని ఆమె తేల్చి చెప్పారు. డిపో పరిధిలోని ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదాల బారిన పడకుండా, సురక్షితమైన ఆర్టీసీ బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు, డిపో సిబ్బంది, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.
బస్సు సర్వీసుల సమయాలు..
దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు: ఉదయం 5:20, 9:30, 10:15, 11:15 మరియు మధ్యాహ్నం/సాయంత్రం 1:45 (13:45), 5:15 (17:15), రాత్రి 6:00 (18:00), 7:00 (19:00) గంటలకు అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ నుంచి దేవరకొండకు: ఉదయం 6:30, 7:15, 8:15, 10:30 మరియు మధ్యాహ్నం/సాయంత్రం 2:15 (14:15), 3:00 (15:00), 4:00 (16:00), సాయంత్రం 6:30 (18:30) గంటలకు బస్సులు తిరుగుతాయి.






