ఈఎస్ఐసీ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగ అభ్యర్థుల నిరసన

by Jakkula.Mamatha |

స్టాఫ్ నర్స్ ప్రభుత్వ ఉద్యోగాల ఆర్డర్ కాపీ జాప్యంను నిరసిస్తూ.. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలో ఉన్న డైరెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.

ఈఎస్ఐసీ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగ అభ్యర్థుల నిరసన
X

దిశ, నాచారం: స్టాఫ్ నర్స్ ప్రభుత్వ ఉద్యోగాల ఆర్డర్ కాపీ జాప్యంను నిరసిస్తూ.. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలో ఉన్న డైరెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వీరి నిరసనకు మద్దతుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. ఇన్చార్జి డైరెక్టర్, ఐఏఎస్ అధికారిని హరి చందనతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే నియామక ఉత్తర్వులు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా ఉద్యోగ నియామక ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. డీఎంఈ, వైద్య విధాన పరిషత్‌లో నియామకాల ఆర్డర్స్ ఇచ్చారని.. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ లో 252 మంది ఉద్యోగులను ఆర్డర్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సుమారు 250 మంది ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు.

Next Story