- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌లో జిల్లా కలెక్టర్ కే. హైమావతికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు వినతి పత్రం అందజేశారు.

దిశ, సిద్దిపేట అర్బన్: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌లో జిల్లా కలెక్టర్ కే. హైమావతికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం టీడబ్ల్యూజేఏఫ్ బాధ్యుడు గరిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకూ అక్రిడేషన్ కార్డు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే కేటాయించాలన్నారు. జర్నలిస్టులకు ఉచితంగా ఆర్టీసీ, మెట్రో పాసులను అందజేయాలన్నారు. రైల్వే పాసుల పునరుద్ధరణ కోసం మోడీ సర్కార్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు రేవంత్ కుమార్, భాస్కర్, ప్రేమ్, యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, రాజు, కిష్టయ్య, యాదగిరి, జనార్ధన్, నర్సింలు, రాములు, చంద్రం, మోహన్, సంజీవ్, నరసింహారెడ్డి, శ్రీను, డీజేఎఫ్‌టీ సభ్యులు చందు తదితరులు పాల్గొన్నారు.






