ఆస్తంతా తీసుకొని ఆలన మరిచాడు.. ప్రజావాణిలో మాతృమూర్తి అర్జీ

by Kodari Anjali |

వారసత్వంగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం, ఆస్తీని అనుభవిస్తున్న చిన్న కొడుకు తన పోషణ పట్టించుకోవడం లేదని ఓ మాతృమూర్తి ప్రజావాణిలో అర్జీ అందజేసింది.

ఆస్తంతా తీసుకొని ఆలన మరిచాడు.. ప్రజావాణిలో మాతృమూర్తి అర్జీ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: వారసత్వంగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం, ఆస్తీని అనుభవిస్తున్న చిన్న కొడుకు తన పోషణ పట్టించుకోవడం లేదని ఓ మాతృమూర్తి ప్రజావాణిలో అర్జీ అందజేసింది. పెద్ద కొడుకు యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం... కొండపాక మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గొడుగు చంద్రమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు వ్యవసాయం చేసుకుంటుండగా, చిన్న కొడుకు రమేశ్ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా చంద్రమ్మ ఆనారోగ్యం పాలైంది. దీంతో చిన్నకొడుకు పట్టించుకోవడం లేదన్నారు. చంద్రమ్మ పేరిట ఉన్న భూమిని చిన్న కొడుకు రమేశ్ ఫోర్జరీ సంతకాల తన పేరిట మార్చుకొని అమ్ముకున్నట్లు తెలిపారు. ఇప్పుడు చంద్రమ్మ ఆలనా పాలన చూసుకోవడం లేదన్నారు.

Next Story