- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. బిల్లు కట్టినా భారీగా తగ్గిన సిబిల్ స్కోర్
ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డు యూజర్లకు ఊహించని షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ వాడుతున్న వేలాది మంది కస్టమర్లు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్రెడిట్ కార్డ్ పెండింగ్ బిల్లులను గడువు లోపలే పూర్తిగా చెల్లించినప్పటికీ జులై నెల క్రెడిట్ రిపోర్టులో ‘ఓవర్ డ్యూ’ (Overdue) ఉన్నట్లుగా చూపిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో కస్టమర్ల సిబిల్ స్కోర్ (CIBIL Score) ఒక్కసారిగా పడిపోవడంతో యూజర్లు సోషల్ మీడియా వేదికగా లబోదిబోమంటున్నారు.
ఒక్కసారిగా 50 నుంచి 70 పాయింట్లు డ్రాప్
అయితే, సాధారణంగా క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. కానీ, ఇక్కడ కస్టమర్లు తాము రూపాయి కూడా బాకీ లేకుండా మొత్తం బిల్లు క్లియర్ చేశామని ఆధారాలతో సహా ‘X’ (ట్విట్టర్) వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ బ్యాంక్ నుంచి తప్పుడు డేటా సిబిల్‌కు వెళ్లడం వల్ల చాలా మంది యూజర్లకు 50 నుంచి 70 పాయింట్ల వరకు సిబిల్ స్కోర్ హఠాత్తుగా తగ్గిపోయింది. దీంతో భవిష్యత్తులో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు తీసుకోవాలనుకునే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.
‘ఎస్‌బీఐ కార్డ్స్’ రియాక్షన్ ఇదే..
కాగా, టెక్నికల్ ఇష్యూపై కస్టమర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తుండటంతో ఎస్బీఐ కార్డ్స్ స్పందించింది. డేటా అప్‌డేట్ కావడంలో ఏదో పొరపాటు జరిగిందని, ఈ సమస్యపై ప్రస్తుతం అంతర్గతంగా రివ్యూ జరుపుతున్నామని బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే సాంకేతిక లోపాన్ని సరిచేసి, కస్టమర్ల సిబిల్ స్కోర్‌ను యథాస్థితికి తీసుకువస్తామని ఎస్‌బీఐ కార్డ్స్ వర్గాలు తెలిపాయి.






