శేఖర్ మాస్టర్‌తో గొడవలు.. అసలు నిజం చెప్పిన జానీ మాస్టర్

by Vemula.Srinu Prasad |

టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్‌తో విభేదాలు తలెత్తాయంటూ జరిగిన ప్రచారానికి జానీ మాస్టర్ చెక్ పెట్టారు..

శేఖర్ మాస్టర్‌తో గొడవలు.. అసలు నిజం చెప్పిన జానీ మాస్టర్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్(Tollywood choreographers Sekhar Master and Jani Master) మధ్య విభేదాలు తలెత్తాయంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి జానీ మాస్టర్ చెక్ పెట్టారు. అసలు నిజాలు వెల్లడించారు. శేఖర్ మాస్టర్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని, వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. సినిమా డాన్సర్ల అసోసియేషన్ సమావేశంలో కేవలం తమ యూనియన్‌కు సంబంధించిన కొన్ని అంతర్గత సమస్యలపై మాత్రమే సుదీర్ఘంగా చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ చర్చలకు, శేఖర్ మాస్టర్‌కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తామంతా ఒకే కుటుంబం లాంటి వాళ్లమని, సోదరుల్లా కలిసి మెలిసి ఉంటామని, యూనియన్ సంక్షేమం కోసమే అందరం శ్రమిస్తామని జానీ మాస్టర్ పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా...

"మా మధ్య గొడవలు జరిగాయనే వార్తలు చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. అసలు ఏం జరిగిందని మమ్మల్ని అడిగారు. నేను, శేఖర్ మాస్టర్ కలిసి చిరంజీవి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాం. ఆ సమయంలో మెగాస్టార్‌తో కలిసి పాత సూపర్ హిట్ పాటలపై, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలపై ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. పరిశ్రమలోని మాస్టర్లందరికీ టాలీవుడ్ హీరోలందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. యూనియన్‌లో వచ్చే చిన్న చిన్న సమస్యలపై చర్చలు జరగడం సహజమే. వాటిని పెద్దవి చేసి చూడాల్సిన అవసరం లేదు’’ అని జానీ మాస్టర్ స్పష్టం చేశారు.

Next Story