- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తపేట టిమ్స్‌కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి : తల్లి శంకరమ్మ
హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని కొత్తపేటలో నిర్మిస్తున్న ‘టిమ్స్’ ఆసుపత్రికి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన తల్లి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని కొత్తపేటలో నిర్మిస్తున్న ‘టిమ్స్’ (TIMS) ఆసుపత్రికి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన తల్లి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిమ్స్‌కు ఆయన పేరు పెడితే అమరుల త్యాగాలకు సముచిత గౌరవం దక్కినట్లవుతుందని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అమరవీరుల కుటుంబాలకు సరైన గుర్తింపు, న్యాయం జరుగుతున్నాయని శంకరమ్మ ప్రశంసించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎంను, మంత్రులను కలిసే అవకాశం ఇవ్వలేదని, కేసీఆర్‌ను ఏడుసార్లు కలిసేందుకు ప్రయత్నించినా విఫలమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం శ్రీకాంతాచారి జయంతిని కూడా గత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదన్నారు. కానీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు కలిసి తమ సమస్యలు వివరించగలిగానని ఆమె చెప్పారు.
ప్రాణత్యాగం చేసిన ప్రాంతం సమీపంలోనే..
కొత్తపేట పాత పండ్ల మార్కెట్ స్థలంలో 27 అంతస్తులతో అత్యాధునిక సౌకర్యాలతో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న ఎల్బీనగర్ చౌరస్తాలోనే శ్రీకాంతాచారి ఆత్మాహుతికి యత్నించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3న ప్రాణత్యాగం చేశాడు. ఆయన అమరుడైన ప్రాంతానికి సమీపంలోనే నిర్మిస్తున్న ఈ ఆసుపత్రికి ఆయన పేరు పెట్టడం సబబుగా ఉంటుందని ఆమె కోరుతున్నారు.






