సందీప్ రెడ్డి దర్శకత్వంలో మోక్షజ్ఞ?

by Pulgam srinivas |

టాలీవుడ్ స్టార్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోక్షజ్ఞ సినీ అరంగేట్రం చేయనున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

సందీప్ రెడ్డి దర్శకత్వంలో మోక్షజ్ఞ?
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఆయన తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం. కొంతకాలం క్రితం మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఆ తర్వాత పలువురు దర్శకులతో మోక్షజ్ఞ సినిమా చేయనున్నట్లు పలు వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఏ ప్రాజెక్ట్ కూడా కార్యరూపం దాల్చలేదు.

తాజాగా టాలీవుడ్‌లో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా రూపొందనున్నట్లు, అదే చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా వంటి భారీ క్రేజ్ ఉన్న దర్శకుడి చిత్రంతో మోక్షజ్ఞ అరంగేట్రం జరిగితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.

అయితే ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్ పార్క్' చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి మోక్షజ్ఞతో సినిమా 'స్పిరిట్' తర్వాత ప్రారంభమవుతుందా? లేక 'యానిమల్ పార్క్' పూర్తైన అనంతరం సెట్స్‌పైకి వెళ్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.

Next Story