నడిరోడ్డుపై ర్యాపిడో రైడర్‌పై యువతి వీరంగం! తప్పుడు కేసు పెడతానని బెదిరింపులు! (వీడియో)

by Ramesh Naini |   (  Updated:2026-07-13 10:19:32  IST  )

నగరంలో కేవలం వంద రూపాయల ప్రయాణపు ఛార్జీని ఎగవేసేందుకు ఓ మహిళ నడిరోడ్డుపై ర్యాపిడో రైడర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

నడిరోడ్డుపై ర్యాపిడో రైడర్‌పై యువతి వీరంగం! తప్పుడు కేసు పెడతానని బెదిరింపులు! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో కేవలం వంద రూపాయల ప్రయాణపు ఛార్జీని ఎగవేసేందుకు ఓ మహిళ నడిరోడ్డుపై ర్యాపిడో రైడర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి ర్యాపిడోలో ప్రయాణించిన సదరు మహిళ.. గమ్యస్థానం చేరుకున్న తర్వాత రైడర్‌కు రూ.100 ఛార్జీ చెల్లించడానికి నిరాకరించింది. డబ్బులు అడిగినందుకు అతడిని హిందీలో అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, తననే వేధిస్తున్నట్లుగా పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు దిగింది. ఆమె ప్రవర్తనతో అప్రమత్తమైన రైడర్ ఆ తతంగాన్నంతా తన మొబైల్‌లో రికార్డ్ చేస్తూ ఈ ఆరోపణలు చేశాడు.

డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఆ మహిళను వెంబడించిన రైడర్.. ఛార్జీ చెల్లించేంత వరకు వదిలేది లేదని, నేరుగా పోలీస్ స్టేషన్‌కు రావాలని డిమాండ్ చేస్తున్న విషయం వీడియోలో కన్పిస్తోంది. అయితే మహిళ మాత్రం రైడర్‌ను పట్టించుకోకుండా నడుస్తూ.. ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారడంతో, సదరు మహిళ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మహిళపై తీవ్ర ఆరోపణలు చేసిన ర్యాపిడో రైడర్‌‌‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసుల నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Next Story