- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తి కోసం దారుణం.. కుక్కలను చంపే ఇంజెక్షన్లు ఎక్కించి సొంత బావ హత్య
ఆస్తి కోసం బావమరిది అత్యంత దారుణానికి పాల్పడ్డారు. సొంత బావకు కుక్కలను చంపే పాయిజన్ ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేశారు. అనంతరం గుండెపోటుగా చిత్రీకరించి కేసు నుంచి తప్పించుకోవాలనుకున్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: ఆస్తి కోసం బావమరిది అత్యంత దారుణానికి పాల్పడ్డారు. సొంత బావకు కుక్కలను చంపే పాయిజన్ ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేశారు. అనంతరం గుండెపోటుగా చిత్రీకరించి కేసు నుంచి తప్పించుకోవాలనుకున్నారు. కానీ బావ తోటి ఉద్యోగుల ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన శ్రీహరి మండలం ఏవోగా పని చేస్తున్నారు. తనకున్న కోట్ల విలువైన ఆస్తిని సొంత బావమరిది హరికృష్ణ పేర రాశారు. అంతేకాదు హరికృష్ణకు కొంత నగదును కూడా అప్పుగా ఇచ్చారు. అయితే సొంత ఇళ్లు కట్టుకోవాలని శ్రీహరి భావించారు. ఈ మేరకు తన ఆస్తిని డబ్బులు రూపంలో తిరిగి ఇవ్వాలని హరికృష్ణను శ్రీహరి అడిగారు. దీంతో తన పేరుతో ఉన్న ఆస్తిని ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఈ మేరకు శ్రీహరిని చంపేందుకు ప్లాన్ చేశారు. బావను చంపేస్తే తన పేరుతో ఉన్న ఆస్తులన్నీ తనకే ఉంటాయని ఆశపడ్డారు. పెంచలకోన టెంపుల్ కు వెళ్లి వద్దామని బావ శ్రీహరికి బావమరిది హరికృష్ణ చెప్పారు. ప్లాన్ ప్రకారం కారులో శ్రీహరిని తీసుకెళ్లారు.
అయితే మార్గ మధ్యలో మరో ఇద్దరిని సెట్ చేసి పెట్టాడు. కారు ఆపి బావ శ్రీహరికి కుక్కలను చంపే పాయిజన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. కొద్దిసేపటికి శ్రీహరి గుండె ఆగిపోయింది. దీంతో శ్రీహరికి గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించారు. అయితే శ్రీహరి మృతదేహంపై గాయాలుండటంతో తోటి ఉద్యోగులకు అనుమానం వ్యక్తం చేశారు. కానీ బంధువులు మాత్రం శ్రీహరి అంత్యక్రియలు జరిపించారు. మిగిలిన ఆస్తులను కూడా ఇవ్వాలని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడంతో హరికృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీహరిని చంపిన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సహకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.






