తెలంగాణ టీచర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మరో టెట్ పరీక్ష

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-13 09:31:00  IST  )

తెలంగాణలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్లకు రాష్ట్ర విద్యాశాఖ శుభవార్త చెప్పింది.

తెలంగాణ టీచర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మరో టెట్ పరీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్లకు రాష్ట్ర విద్యాశాఖ శుభవార్త చెప్పింది. పదోన్నతులు, ఉద్యోగ అర్హతల కోసం టెట్ (Teacher Eligibility Test) అర్హత సాధించాల్సిన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా స్పెషల్ టీజీ-టెట్ (Special TG-TET) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీచర్లుగా పనిచేస్తూ.. ప్రమోషన్ల కోసం ఎదురుచూసే టీచర్లకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఈనెల 21న స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, సెప్టెంబర్ 7,8,9 తేదీల్లో ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహిస్తామని డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. సాధారణ టెట్‌కు అదనంగా ఈ పరీక్షను నిర్వహించడం ద్వారా ఇప్పటివరకు టెట్ అర్హత సాధించని ఉపాధ్యాయులకు మరో అవకాశం కల్పించనున్నారు. దీంతో పదోన్నతులు, సేవా నిబంధనలకు అవసరమైన టెట్ అర్హత పొందేందుకు వేలాది మంది ఉపాధ్యాయులకు అవకాశం లభించనుంది.

Next Story