గ్రామీణులకు అందుబాటులో అంబులెన్స్ సేవలు

by Batti.Sumithra |

అత్యవసర సమయాల్లో గ్రామీణ ప్రజలకు సకాలంలో వైద్య సహాయం అందించేందుకు మాతృదేవో భవ–పితృదేవో భవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవలను గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్‌గౌడ్ సంస్థ వ్యవస్థాపకులు కురిమేటి నవీన్ నరేందర్ ప్రారంభించారు.

గ్రామీణులకు అందుబాటులో అంబులెన్స్ సేవలు
X

దిశ, ఆత్మకూరు(ఎం) : అత్యవసర సమయాల్లో గ్రామీణ ప్రజలకు సకాలంలో వైద్య సహాయం అందించేందుకు మాతృదేవో భవ–పితృదేవో భవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవలను గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్‌గౌడ్ సంస్థ వ్యవస్థాపకులు కురిమేటి నవీన్ నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రాణాపాయ పరిస్థితుల్లో బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించడంలో ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అవసరమైన వారు 8008817283, 7288917283 నంబర్లను సంప్రదించి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మజ్జిగ నరేశ్, ప్రధాన కార్యదర్శి తొండల అనిల్‌కుమార్ గౌడ్‌తో పాటు యువజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

Next Story