- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రీమ్ హీరోపై మనసు విప్పిన నాగ దుర్గ.. ఛాన్స్ వస్తే నో చెప్పను
ప్రభాస్‌తో నటించే అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటానని తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగ దుర్గ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ డాన్సర్ నాగ దుర్గ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటించిన అనేక ఫోక్ సాంగ్స్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ఇప్పుడు ఆమె వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల నాగ దుర్గ నటించిన తమిళ చిత్రం 'లవ్ ఓ లవ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె చిత్ర ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన అభిమాన హీరో గురించి మాట్లాడిన నాగ దుర్గ, "నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటాను" అని చెప్పింది.
ప్రస్తుతం నాగ దుర్గ 'ఇడుపు కాయితం' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా విజయవంతమైతే నాగ దుర్గ కెరీర్ మరింత వేగంగా ముందుకు సాగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






