కొడవటూర్ సిద్ధేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం

by Ratna Kumari |

బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్ శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది.

కొడవటూర్ సిద్ధేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం
X

దిశ, బచ్చన్నపేట : బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్ శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పిన్నింటి కావ్య బాపురెడ్డి హాజరయ్యారు. ముందుగా బీర్ల అయిలయ్య శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. కొడవటూర్ శ్రీ సిద్ధేశ్వర స్వామి క్షేత్రం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రమని అన్నారు. ఆలయాల సమగ్ర అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజా సంక్షేమంతో పాటు ఆధ్యాత్మిక వైభవానికీ కాంగ్రెస్ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కొడవటూర్ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పిన్నింటి కావ్య బాపురెడ్డి మాట్లాడుతూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలా కవిత మురళి, ప్రధాన అర్చకులు ఓం నమః శివాయ, సుంకోజు కృష్ణమూర్తి, ఆలయ డైరెక్టర్లు చిక్కుడు మల్లేశం, రాజేష్, బసిరెడ్డిపల్లి మైపాల్ రెడ్డి, నిమ్మ కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story