Venkatramireddy: ప్రభుత్వంపై అసంతృప్తి.. ‘బోడిగుండు’తో నిరసన

by Vemula.Srinu Prasad |

కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ వినూత్న నిరసనకు దిగింది. ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు నేతలు గుండు చేయించుకుని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ..

Venkatramireddy: ప్రభుత్వంపై అసంతృప్తి.. ‘బోడిగుండు’తో నిరసన
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ వినూత్న నిరసనకు దిగింది. ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు నేతలు గుండు చేయించుకుని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సి ఆర్థిక ప్రయోజనాలను కూడా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని మండిపడ్డారు. పీఆర్సీతో పాటు ఐఆర్, డీఏలు, సరెండర్ లీవ్‌ల చెల్లింపులనూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఐఆర్ విషయంలోనూ అన్యాయమే జరిగిందన్నారు. ఉద్యోగులతో పాటు వాలంటీర్లకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ నెరవేర్చే వరకూ తమ పోరాటం కొనసాగుతోందని హెచ్చరించారు.

Next Story