పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి భారీగా సీట్లు మంజూరు

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 100 ఎం .బి.బి. ఎస్ సీట్ల భర్తీకి జాతీయ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి...

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి భారీగా సీట్లు మంజూరు
X

దిశ, నరసరావుపేట ప్రతినిధి: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 100 ఎం .బి.బి. ఎస్ సీట్ల భర్తీకి జాతీయ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు కూడా తుది దశకు చేరనున్నాయి. ఇప్పటికే ఈ కళాశాల‌కు అవసరమైన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఆసుపత్రికి అవసరమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర టెక్నీషియన్ల ఎంపిక కూడా పూర్తి అవుతోంది. మెడికల్ కాలేజీ ప్రారంభ కానుందన్న వార్త పల్నాడు వాసులకు ఆనందం కలుగజేస్తుంది.

Next Story