- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్దులగుట్ట పై భోజనశాల నిర్మాణ పనులకు భూమి పూజ
by Jakkula.Mamatha |
సిద్దుల గుట్టపై రూ.50 లక్షలతో నిర్మించ తలపెట్టిన భోజన శాల నిర్మాణ పనులకు సోమవారం ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ చేశారు.

X
దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దుల గుట్టపై రూ.50 లక్షలతో నిర్మించ తలపెట్టిన భోజన శాల నిర్మాణ పనులకు సోమవారం ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిలు మంజూరు చేయించిన రూ.50 లక్షల నిధులతో సిద్దుల గుట్ట పైన భక్తుల సౌకర్యార్థం భోజనశాల నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, కోడిగెల మల్లయ్య, జిమ్మీ సంధ్యా రవి, రామగౌడ్, శ్రీనివాస్, సంధ్య రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






