బ్రిడ్జి కట్టారు కానీ తారు రోడ్డు మరిచారు.. బురదలో కూరుకుపోయిన బస్సు, డీసీఎం!

by Jakkula.Mamatha |

రామారెడ్డి మండల కేంద్రం సమీపంలోని నూతనంగా బ్రిడ్జి నిర్మించారు కానీ తారు రోడ్డు వేయడం మరిచారు.

బ్రిడ్జి కట్టారు కానీ తారు రోడ్డు మరిచారు.. బురదలో కూరుకుపోయిన బస్సు, డీసీఎం!
X

దిశ,సదాశివ నగర్(రామారెడ్డి): రామారెడ్డి మండల కేంద్రం సమీపంలోని నూతనంగా బ్రిడ్జి నిర్మించారు కానీ తారు రోడ్డు వేయడం మరిచారు. బ్రిడ్జి వేసినప్పటికీ ఇరువైపులా మొరం పోశారు. రెండు రోజుల నుంచి రాత్రి కురిసిన వర్షాలకు బ్రిడ్జి పై రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఆర్టీసీ బస్సు, డీసీఎం వాహనాలు మొరంలో దిగుబడిపోయాయి. దీంతో రాకపోకలకు చాలా ఇబ్బంది ఏర్పడిందని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఆర్టీసీ బస్సు, డీసీఎంను క్రేన్ సాయంతో బయటకు తీశారు. సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బ్రిడ్జిపై వెళ్లాలంటే వాహన చోదకులు జంకుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తారు రోడ్డును వేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story