Puri Jagannadh: వాళ్ళు క్రిమినల్స్ కంటే డేంజర్ జాగ్రత్తగా ఉండండి.. స్టార్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-28 14:03:40  IST  )

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు వీడియోలు షేర్ చేస్తున్నారు.

Puri Jagannadh: వాళ్ళు క్రిమినల్స్ కంటే డేంజర్ జాగ్రత్తగా ఉండండి.. స్టార్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా, ఆయన కుటుంబ సభ్యులు ఎమోషనల్ బ్లాక్ చేయడంలో క్రిమినల్స్(Criminals) కంటే డేంజర్ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘‘అతి ప్రమాదకరమైనది ఎమోషనల్ బ్లాక్‌మెయిల్(emotional blackmail). ముక్కు, ముఖం తెలియని వ్యక్తులు బ్లాక్‌మెయిల్ (blackmail) చేస్తే.. నీ ఇంట్లో వాళ్లు, నువ్వు బాగా ప్రేమించే వ్యక్తులు మాత్రం నిన్ను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తారు.

నీ కోసం ఇంత చేశాం. నువ్వు పెళ్లి(marriage), పిల్లల వంటి విషయాల్లో మా కోసం అడ్జస్ట్ కాలేవా? అని ఒత్తిడి చేస్తుంటారు. మనల్ని కంట్రోల్(control) చేయడానికి ప్రేమను చూపించే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా వాళ్లు అనుకున్నది జరగాలి. కానీ మీకు నచ్చింది ఏంటో తెలుసుకోరు. వారి కోసం పెళ్లి చేసుకుని పిల్లలను కంటే పెంచాల్సింది మీరు. అలా అని వారి మాటను మీరు కాదంటే.. అడిగింది చేయలేదని మీతో మాట్లాడటం మానేస్తారు.

ఇలాంటి వాటి వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడపడంతో పాటు ఒత్తిడి(stress)కి గురవుతారు. మీలో మీరే మదనపడుతూ బతుకుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో వాళ్ళు క్రిమినల్స్ కంటే డేంజర్. ఎవరి స్వార్థం వారిదే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తే వారిని పక్కన పెట్టేయండి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ పూరి అభిమానులను ఆకట్టుకుంటోంది.

Click For Video ...

Read More ...

Yamudu: ‘అపరిచితుడు’ కాన్సెప్ట్‌తో మరో చిత్రం.. భయపెడుతోన్న పోస్టర్

Next Story