- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడాకుల పిటిషన్: విజయ్ పై భార్య సంగీత మోపిన 7 కీలక అభియోగాలు ఇవే..!
విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ వెనుక షాకింగ్ నిజాలు: వివాహేతర సంబంధం, మానసిక వేధింపులే ప్రధాన కారణం. ఏప్రిల్ 20న కోర్టుకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెట్టిన హీరో, టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్‌కు భార్య సంగీత ఉహించని షాక్ ఇచ్చింది. గత నాలుగు సంవత్సరాలుగా విజయ్ తనన వేదిస్తున్నాడని ఆరోపిస్తూ చెంగల్పట్టు కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేసింది. ప్రధానంగా వివాహేతర సంబంధం (Adultery), మానసిక వేధింపులు (Cruelty) వంటి అంశాలను ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మీడియా కథనాల ప్రకారం ఆమె మోపిన 7 కీలక అభియోగాలు ఇలా ఉన్నాయి.
వివాహేతర సంబంధం: సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నటితో విజయ్ 2021 ఏప్రిల్ నుంచి సంబంధం పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.
నిర్లక్ష్యం: తాను ఈ విషయం అడిగినా ఆయన ఏమాత్రం పశ్చాత్తాపం చూపకుండా ఆ సంబంధాన్ని కొనసాగించారని పేర్కొన్నారు.
మానసిక వేదన: విజయ్ ప్రవర్తన వల్ల తాను గత కొన్నేళ్లుగా తీవ్ర మానసిక క్షోభకు గురై నట్లు తెలిపారు.
ఆర్థిక ఆంక్షలు: ఇంట్లో తన ఆర్థిక స్వేచ్ఛను హరించారని, ఖర్చుల విషయంలో ఆంక్షలు విధించారని ఆరోపించారు.
స్వేచ్ఛా హరణం: తన వ్యక్తిగత స్వేచ్ఛను, కదలికలను నియంత్రించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
వేధింపులు: తనపై నిరంతరం మాటలతో దాడి (Verbal abuse) చేస్తూ చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వేరుగా నివాసం: గడచిన రెండేళ్లుగా తాము విడివిడిగానే ఉంటున్నామని, రాజీ పడే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
గత కొంతకాలంగా విజయ్ దంపతులు విడివిడిగా ఉంటున్నారనే ప్రచారానికి బలం చేకూరుస్తూ, ఆయన భార్య సంగీత సోర్ణలింగం విడాకుల కోసం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం, ఏప్రిల్ 20, 2026న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది.
విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని వేగవంతం చేసి, ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ఈ విడాకుల వ్యవహారం ఆయనకు పెద్ద ఎదురుదెబ్బ గా భావిస్తున్నారు. ఈ ఆరోపణలపై విజయ్ వర్గం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. అయితే, ఆయన రాజకీయ ప్రత్యర్థులు దీనిని ఆయుధంగా చేసుకునే అవకాశం ఉండటంతో, విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు నోటీసుల నేపథ్యంలో ఏప్రిల్ 20న విజయ్ ఇచ్చే వివరణ పైనే ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది ఆధారపడి ఉంది.






