భారత మార్కెట్లో భారీ వృద్ధికి అవకాశాలున్నాయి: లంబొర్ఘిని!

by Disha Web Desk 17 |
భారత మార్కెట్లో భారీ వృద్ధికి అవకాశాలున్నాయి: లంబొర్ఘిని!
X

ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబొర్ఘిని భారత వాహన మార్కెట్లో తమకు గణనీయమైన వృద్ధికి అవకాశం ఉందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి అత్యంత సంపన్న వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా వృద్ధి సాధించగలమని కంపెనీ ఛైర్మన్, సీఈఓ స్టిఫెన్ వింకెల్‌మన్ అన్నారు. 2021లో దేశీయంగా కంపెనీ మొత్తం 69 కార్లను విక్రయించి 86 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ప్రాధాన్యత నేపథ్యంలో కంపెనీ హైబ్రిడ్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు పేర్కొంది.

భారత మార్కెట్లో మెరుగైన వృద్ధికి అవకాశం ఉందని భావిస్తున్నాం. దేశీయంగా సంపదతో పాటు అభివృద్ధిని కూడా చూస్తున్నాం. గతేడాది అత్యధిక వృద్ధిని నమోదు చేయడమే దీనికి సాక్ష్యం. భవిష్యత్తులో మరింత వృద్ధి సాధించగలమనే విశ్వాసం కలుగుతోంది. ఇటీవల కొత్తగా అత్యంత సంపన్న వర్గం భారత్‌లో పెరుగుతున్నారని స్టిఫెన్ వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి హైబ్రిడ్ వాహనాలపై ప్రణాళిక ఉంది. అయితే, పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ల వైపునకు మారే ఆలోచన ప్రస్తుతానికి లేదు. ఇది సరైన సమయం అని కూడా భావించడం లేదని ఆయన వెల్లడించారు.


Next Story