జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధిలో రాజీ పడేదే లేదు

by Ratna Kumari |

నియోజకవర్గాన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని దానికి నిదర్శనమే నేడు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కండ్లకు కనబడడమే నిదర్శనమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు.

జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధిలో రాజీ పడేదే లేదు
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడేదే లేదని ఇప్పటికే నియోజకవర్గాన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని దానికి నిదర్శనమే నేడు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కండ్లకు కనబడడమే నిదర్శనమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల పట్టణ ప్రజలకు మరిత మెరుగైన అగ్నిమాపక సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు ఆశల రక్షణలో సర్వీసుల పాత్ర ఎంతో కీలకమని పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో ఫైర్ స్టేషన్ నిర్మాణం చేపట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు అత్యవసర పరిస్థితుల సత్వర స్పందనకు అవకాశం కలుగుతుందని అన్నారు.

జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన మాలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని సమయానికి పూర్తిచేసెల కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం తొలి ఏకాదశి సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని శ్రీ రంగనాయక స్వామి ని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. అనంతరం గంగాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్చర్ల పట్టణంలోని డబల్ బెడ్ రూమ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను ఐమాక్లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాజాపూర్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ల పంపిణీ లైబ్రరీ పుస్తకాల పంపిణీ ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తాతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story