- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌స్టాగ్రామ్ డేటా లీక్ వార్తల్లో నిజం లేదు: మెటా క్లారిటీ
గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల డేటా లీక్ అయ్యిందంటూ అనేక వార్తలు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల డేటా లీక్ (Instagram users' data leaked) అయ్యిందంటూ అనేక వార్తలు వచ్చాయి. యూజర్లు వెంటనే తమ యూజర్ నేమ్, పాస్ వర్డ్స్ మార్చుకొవాలని కొన్ని ఈ మేయిల్స్ వచ్చినట్లు అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా వచ్చిన వార్తలను మెటా సంస్థ తీవ్రంగా ఖండించింది. చాలా మంది యూజర్లకు అనుకోకుండా 'పాస్‌వర్డ్ రీసెట్' మెయిల్స్ రావడంతో, తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయని ఆందోళన చెందారు. అయితే, ఇది డేటా లీక్ వల్ల జరిగింది కాదని, తమ సిస్టమ్స్‌లో ఎలాంటి లోపం లేదని ఇన్‌స్టాగ్రామ్ స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పాస్‌వర్డ్ రీసెట్ మెయిల్స్ (Password reset emails) రావడానికి కారణమైన సాంకేతిక లోపాన్ని (బగ్) ఇప్పటికే పరిష్కరించినట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారులు తమకు వచ్చిన ఆ మెయిల్స్‌ను పట్టించుకోవద్దని, పాస్‌వర్డ్ మార్చుకోవాల్సిన అవసరం లేదని సూచించింది. ప్రతి ఒక్కరి ఖాతా సురక్షితంగా ఉందని భరోసా ఇస్తూ, ఈ సంఘటన వల్ల యూజర్లలో ఏర్పడిన గందరగోళానికి సంస్థ క్షమాపణలు కోరింది.






