'నిమ్స్'లో నిఘా కరువు

by Muthe.Rajitha |

నగరంలోని నిమ్స్ ఆ సుపత్రి ప్రాంగణంలో నిఘా కరువైం ది. ఈ క్రమంలో బాలికపై లైంగిక దాడి యత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది.

నిమ్స్లో నిఘా కరువు
X

దిశ, ఖైరతాబాద్ : నగరంలోని నిమ్స్ ఆ సుపత్రి ప్రాంగణంలో నిఘా కరువైం ది. ఈ క్రమంలో బాలికపై లైంగిక దాడి యత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి ఆవరణలో నిర్మా ణంలో ఉన్న భవనం వద్ద నివసిస్తున్న ఓ కార్మిక కుటుంబానికి చెందిన బాలి కపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించ గా, బాలిక కేకలు వేయడంతో స్థాని కులు అక్కడికి చేరుకుని ఘటనను అడ్డుకున్నారు. అనంతరం నిందితుడు పరారవగా, బాధిత కుటుంబం ఫి ర్యాదు మేరకు పోలీసులు పోక్సో చ ట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనతో నిమ్స్ ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థ, అధికారుల పర్యవేక్షణ, సెక్యూరిటీ సిబ్బంది విధుల నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో వేలాది మంది రోగులు, వారి బంధువులు, సందర్శకులు, కాంట్రాక్ట్ కార్మికులు నిత్యం సంచరిస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు ఎలా సంచరిస్తున్నారు? నిర్మాణ ప్రాంతాల్లో భద్రతా చర్యలు ఎందుకు కఠినంగా అమలు కావడం లేదు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అటెండర్లకు కఠిన నిబంధనలు.. అసలు సమస్యలపై నిర్లక్ష్యం?

రోగుల వెంట వచ్చే అటెండర్ల‌పై సెక్యూరిటీ సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉ న్నాయి. పేషంట్‌కు మందులు లేదా ఇతర అవసరాల కోసం బయటకు వెళ్లిన అటెండర్లను తిరిగి లోపలికి అనుమతించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వాపోతున్నారు. కొన్నిసార్లు గంటల తరబడి గేట్ల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని అంటున్నారు.

లంచాల ఆరోపణలు..!

ఆసుపత్రి ప్రాంగణంలోకి తిరిగి ప్రవే శం కల్పించేందుకు కొంతమంది సి బ్బంది అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేకపోయి నా, ఆసుపత్రి యాజమాన్యం దీనిపై విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని రోగుల బంధువులు కోరుతున్నారు..

ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళ్తున్నారు..?

నిమ్స్ వంటి అతిపెద్ద ప్రభుత్వ వైద్యసంస్థలో రోజుకు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అయి తే ఆసు పత్రి ఆవరణలోకి ఎవరు ప్రవేశిస్తున్నారు? ఎవరు బయటకు వెళ్తున్నారు? అనే అంశాలపై సమ గ్ర పర్యవేక్షణ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నిర్మా ణ ప్రాంతాలు, కార్మికుల నివాస ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు, భ ద్రతా సిబ్బంది పర్యవేక్షణ తగిన స్థాయిలో లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

భద్రతపై సమగ్ర సమీక్ష అవసరం..!

తాజా ఘటన నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యం భద్ర తా వ్యవస్థపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ప్రజ లు కోరుతున్నారు. ముఖ్యంగా నిర్మాణ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత, అదనపు సీసీ కెమెరాలు, సందర్శకుల నమోదు విధానం, కార్మికుల గుర్తింపు వ్యవస్థ, మహిళలు, చిన్నా రుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలికపై లైంగిక దాడి య త్నం ఘటన ఒక నేర ఘటన మాత్రమే కాకుండా, ఆసుపత్రి భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చింద ని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తుతో పాటు ఆసుపత్రి యాజమా న్యం కూడా అం తర్గత విచారణ చేపట్టి, భవిష్యత్తులో ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవస రం ఉందని ప్రజలు కోరుతున్నారు.

Next Story