- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : కంగనా రనౌత్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. కంగనా రనౌత్ కీలక పాత్రలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'భారత్ భాగ్య విధాత' సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యంత తక్కువ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. కేవలం దేశవ్యాప్తంగా దాదాపు రూ. 1 కోటి వసూలు చేయడం ఫిలిం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. థియేటర్లలో కేవలం 11 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు కావడంతో, కంగనా రనౌత్ స్టార్ పవర్ బాక్సాఫీస్ వద్ద మరోసారి ఫెయిల్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో కామా హాస్పిటల్‌లో గర్భిణీలను, రోగులను కాపాడిన రియల్ లైఫ్ నర్స్ అంజలి కుల్తే వీరోచిత పోరాటం నేపథ్యంలో దర్శకుడు మనోజ్ తపడియా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లౌడ్ దేశభక్తి డైలాగులు లేకుండా, ఒక సాధారణ నర్సు పాత్రలో కంగనా రనౌత్ నటించింది. కాగా కంగనా గత చిత్రం 'ఎమర్జెన్సీ'తో పాటు ఈ సినిమా కూడా ఓపెనింగ్స్ రాబట్టడంలో విఫలమవడంతో ఆమె డిజాస్టర్ల పరంపర కొనసాగుతోంది. మేకర్స్ 1+1 టికెట్ ప్రకటించినప్పటికీ కలెక్షన్స్ మాత్రం నిరాశాజనకంగానే ఉన్నాయి.






