- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ ధర్నా
పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగుతున్న నిరసనల సెగ ఈరోజు హైదరాబాద్ ను తాకనుంది.

దిశ, వెబ్ డెస్క్ : పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగుతున్న నిరసనల సెగ ఈరోజు హైదరాబాద్ ను తాకనుంది. అందులో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్‌లో భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. నగరంలోని ఇందిరా పార్క్ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ వేదికగా ఉదయం 10:00 గంటల నుంచి ఈ నిరసన కార్యక్రమం ప్రారంభం కానుందని నిర్వాహకులు ప్రకటించారు.
CJP ప్రధాన డిమాండ్లు ఇవే..
దేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్యావ్యవస్థలో తక్షణ సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ CJP ఈ ధర్నాను చేపట్టింది. దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విద్యావ్యవస్థలో, జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకతను తీసుకురావడంతో పాటు సమూల సంస్కరణలు ప్రవేశపెట్టాలని CJP డిమాండ్ చేస్తోంది. ఈ భారీ ధర్నాలో నగరంలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, నిరుద్యోగ యువత, పౌర సమాజ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ధర్నా నిర్వహణకు పోలీసులు అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత మార్గంలో ఈ నిరసనను విజయవంతం చేయాలని విద్యార్థులకు, యువతకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ ధర్నా నేపథ్యంలో ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.






