- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారులను అలర్ట్ చేసిన సర్కార్
భారీవర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హైఅలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భారీవర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హైఅలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, క్యూర్ స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులందరితో యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్ మోహరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
రంగంలోకి హైడ్రా బైక్ టీమ్
హైదరాబాద్ మహానగరంలో గాలివానల నేపథ్యంలో హైడ్రా బైక్ టీమ్ లు సిటీవాసులు భరోసా ఇస్తున్నాయి. హైడ్రా డీఆర్ఎఫ్ వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేని పరిస్థితుల్లో వీటి సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. గతేడాది హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా బైక్ టీమ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం 20 బైక్ లను డీఆర్ఎఫ్ వాహనాల చెంతనే అందుబాటులోకి ఉంచుతున్నారు. మొత్తం 60 మంది 24 గంటల పాటు మూడి షిఫ్టుల్లో ఇవి పనిచేయనున్నారు. నగరంలో డీఆర్ఎఫ్, మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు, స్టాటిక్ టీమ్‌లకు అదనంగా వీరు పనిచేస్తారు. ముందుగా రోడ్లపై ఉన్న ఆటంకాలు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయడంలో హైడ్రాలో బైక్ టీమ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నగరంలో 80 ప్రాంతాల్లో చెట్లు పడిపోగా హైడ్రా బైక్ టీమ్స్ తో పాటు డీఆర్ఎఫ్ బృందాలు ఫిర్యాదులను పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు. ఈనెల 9న మొత్తం 192చోట్ల చెట్లు పడిపోగా బైక్ టీమ్స్ తో పాటు డీఆర్ఎఫ్ బృందాలు తొలగించాయి.
జలమండలి కస్టమర్ కేర్ 155313
సిటీలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాటర్ హాట్ స్పాట్లను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిల్స్ బిగింపు, ప్రమాదకర మ్యాన్ హోల్స్ వద్ద రెడ్ ఫ్లాగ్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జలమండలి, జీహెచ్ఎంసీ 140 వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని ఎండీ సూచించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్స్ మూతలు తెరవకూడదని హెచ్చరించారు. ఫిర్యాదులకు జలమండలి కస్టమర్ కేర్ 155313కు కాల్ చేయాలని కోరారు.
అధికారులకు సెలవులు రద్దు: మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను అలెర్ట్ చేశారు. సీఈ నుంచి ఏఈ వరకు ఇంజినీర్లు అందరూ క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. భారీవర్షాలకు ఇబ్బందికంగా మారే రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రోడ్లు కోతకు గురైతే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజారవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. శని, ఆదివారాలు సెలవులు ఏమీ లేవని, అత్యవసరం అయితే తప్ప అందరు ఫీల్డ్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ సెంటర్ ఏర్పాటుచేసి రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, బ్రిడ్జిల పరిస్థితి మానిటరింగ్ చేయాలని, రాష్ట్రంలోని అన్ని ఆర్అండ్ బీ డివిజన్ల వారీగా వివరాలను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
డీజీపీ క్షేత్రస్థాయి పర్యటన
వర్షాల నేపథ్యంలో మాన్ సూన్ సన్నద్ధత, రెస్పాన్స్ చర్యల్లో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన, సైబరాబాద్ సీపీ ఎం.రమేష్ తో కలిసి డీజీపీ సీవీ ఆనంద్ మల్కంచెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. భారీవర్షాల నేపథ్యంలో నీటి ప్రవాహం సజావుగా కొనసాగేందుకు నీటి నిల్వలు ఉండకుండా చేపడుతున్న చర్యలను సమీక్షించారు. వారి వెంట సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఇంజినీరింగ్ విభాగం, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, అర్బన్ బయోడైవర్సిటీ విభాగాల అధికారులు ఉన్నారు. మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు, ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సైబరాబాద్ వ్యాప్తంగా ప్రధాన నీటి నిల్వల ప్రాంతాలను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేశారు.
నేడు, రేపు భారీ వర్షాలు
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.






