- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ వివాహాల తర్వాత వారిలో ప్రేమ ఉండటం లేదు.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రేమ వివాహం తర్వాత వైవాహిక సంబంధాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ వివాహం తర్వాత వైవాహిక సంబంధాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఒక మ్యాట్రిమోనియల్ (వైవాహిక) కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న స్పందిస్తూ, ప్రస్తుత కాలంలో మారుతున్న బంధాల తీరుపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రేమ వివాహాల విషయంలో.. పెళ్లికి ముందు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, పెళ్లి జరిగిన తర్వాత ఆ బంధంలో ప్రేమ క్రమంగా తగ్గిపోతోందని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, పెద్దలు కుదిర్చిన వివాహాల (Arranged Marriages) ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో దంపతుల మధ్య ప్రారంభంలో పరిచయం లేకపోయినా, వివాహం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ప్రేమ క్రమంగా పెరుగుతుందని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. వివాహ బంధంలో సహనం, ఒకరిపై ఒకరికి ఉండాల్సిన గౌరవం గురించి చర్చిస్తూ న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.






