HYD: మేడిపల్లిలో దొంగల హల్‌చల్.. కత్తులతో సంచరిస్తూ..

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-16 06:11:53  IST  )

హైదరాబాద్‌ శివారులోని మేడిపల్లిలో దొంగలు హల్‌చల్ చేశారు.

HYD: మేడిపల్లిలో దొంగల హల్‌చల్.. కత్తులతో సంచరిస్తూ..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ శివారులోని మేడిపల్లి(Medipalli) పోలీస్ స్టేషన్ పరిధి అయిన చెంగిచెర్లలో దొంగలు హల్‌చల్ చేశారు. గురువారం అర్ధరాత్రి 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. సీసీ టీవీలు చెక్ చేయగా.. అంతకుముందు రోజే రెక్కీ చేసినట్లు గుర్తించారు. చేతిలో కత్తులు పట్టుకుని పరిసరాల్లో కలియతిరిగారు. గత రాత్రి కార్లలో వచ్చి పక్కా ప్లాన్‌తో 12 ఇళ్లలో చోరీ చేసి పరార్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు(Medipalli Police) దర్యాప్తు చేస్తున్నారు. ఎంత దొంగిలించారనే విషయం ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story