25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ వైర్ చోరీ.. కేసు నమోదు

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-02 09:31:58  IST  )

నర్సింహులపేట స్టేజ్ ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారి పక్కన ఉన్న బీఆర్‌కే బ్రిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని 25 కెవి ట్రాన్స్‌ఫార్మర్‌కు చెందిన కాపర్ వైర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ వైర్ చోరీ.. కేసు నమోదు
X

దిశ, నర్సింహులపేట: నర్సింహులపేట స్టేజ్ ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారి పక్కన ఉన్న బీఆర్‌కే బ్రిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని 25 కెవి ట్రాన్స్‌ఫార్మర్‌కు చెందిన కాపర్ వైర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఈ చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ లైన్‌మెన్ చెల్లమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే ఆ వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని ఎస్సై వెంకన్న సూచించారు.

Next Story