దారుణం.. ఆలయంలోనే ఆ పని

by S Gopi |

దిశ, అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామ పంచాయతీ..Theft in the temple

దారుణం.. ఆలయంలోనే ఆ పని
X

దిశ, అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామ పంచాయతీ కట్టుగూడెం గ్రామ శివారులోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన వ్యక్తులు.. ఆలయ తలుపులు పగులగొట్టి, గర్భగుడికి ఎదురుగా ఉన్న హుండీని కూడా పగులగొట్టి హుండీలోని డబ్బులను ఎత్తుకెళ్లిన విషయాన్ని గ్రహించారు. వెంటనే ఆలయ చైర్మన్ కు సమాచారం అందించారు. గుడికి చేరుకున్న చైర్మన్ ఆలయ పరిసరాలను, గర్భాలయాన్ని పరిశీలించారు. అనంతరం హుండీలో డబ్బులు మినహా.. ఆలయంలో ఏ వస్తువులు అపహరణ కాలేదని గుర్తించారు. అలాగే ఆలయానికి పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలో కూడా ఆలయం తలుపులు పగులగొట్టి చోరీకి యత్నించారు. ఇదే విషయంపై ఆలయ చైర్మన్ నల్లమోతు రవి అన్నపరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్సై తిరుపతిరావు ఆలయానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Next Story