దుబ్బాకలో తాళం వేసిన ఇంట్లో చోరీ.. కిలో బంగారం, నగదు అపహరణ

by Jakkula.Mamatha |

కుటుంబ సమేతంగా కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్లిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి లాకర్ పగులగొట్టి కిలో బంగారం, నగదు అపహరించిన ఘటన దుబ్బాక పట్టణంలో సోమవారం కలకలం రేపింది.

దుబ్బాకలో తాళం వేసిన ఇంట్లో చోరీ.. కిలో బంగారం, నగదు అపహరణ
X

దిశ, దుబ్బాక: కుటుంబ సమేతంగా కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్లిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి లాకర్ పగులగొట్టి కిలో బంగారం, నగదు అపహరించిన ఘటన దుబ్బాక పట్టణంలో సోమవారం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మున్సిపల్ పట్టణంలోని 15వ వార్డుకు చెందిన చింత రాజ్‌కుమార్ కుటుంబ సమేతంగా కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్లగా, ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని లాకర్‌ను పగులగొట్టి అందులో భద్రపరిచిన కిలో బంగారం, నగదును అపహరించి పరారైనట్లు సమాచారం.

రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం ఇంటి పనిమనిషి ఇంటికి రాగా, ఇంటి తలుపులు పగులగొట్టబడి ఉండటాన్ని గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని ఇంటి యజమానులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ సిబ్బందిని రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం తో డాగ్స్ స్కార్డు తో ఆధారాలు సేకరిస్తున్న సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి. యాత్ర నుండి తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులు.ఎంత మొత్తంలో చోరీ జరిగిందనేది కుటుంబ సభ్యులు చెపితే గాని తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story