పెద్దమ్మ తల్లి గుడిలో చోరీ..30 కిలోల పంచలోహ విగ్రహం అపహరణ

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-19 09:10:28  IST  )

మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త, గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో చోరీ జరిగింది.

పెద్దమ్మ తల్లి గుడిలో చోరీ..30 కిలోల పంచలోహ విగ్రహం అపహరణ
X

దిశ, యాచారం: మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త, గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో చోరీ జరిగింది. శుక్రవారం ఉదయం పెద్దమ్మతల్లి ఆలయానికి భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్ళగా అప్పటికే గుడి తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి ముదిరాజ్ కులస్తులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. అమ్మవారి 30 కిలోల పంచలోహ విగ్రహం, నాగ పడిగే, రెండు గంటలు దొంగలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ, ఘటన స్థలానికి చేరుకొని ఆలయాన్ని పరిశీలించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కానమోని గణేష్, సత్యనారాయణ, వెంకటేష్, కృష్ణయ్య, కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story