కోరిటికల్ వెంకన్న ఆలయంలో చోరీ

by Jakkula.Mamatha |

మండలంలోని కోరిటికల్ గ్రామంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది.

కోరిటికల్ వెంకన్న ఆలయంలో చోరీ
X

దిశ, మామడ: మండలంలోని కోరిటికల్ గ్రామంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయ తాళాలు పగులగొట్టి హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం పూజారి ఆలయానికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండటం చూసి షాక్ అయ్యారు. హుండీ చెల్లాచెదురుగా ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి, ఆలయ కమిటీ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలో వరుస దొంగతనాలు జరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హనుమండ్లు పేర్కొన్నారు.

Next Story