పూరీలో జగన్నాథుని ‘స్నాన యాత్ర’ వైభవం.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

by Malleboina Mahesh |

పూరీ క్షేత్రంలో కన్నులపండువగా జగన్నాథుని ‘స్నాన యాత్ర’.. 108 పవిత్ర కలశాలతో జలాభిషేకం, లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు!

పూరీలో జగన్నాథుని ‘స్నాన యాత్ర’ వైభవం.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో సోమవారం ఉదయం దేవ స్నాన పూర్ణిమ (Deva Snan Purnima) మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సుభద్ర దేవిల సాంప్రదాయక ‘స్నాన యాత్ర’ వేడుకను కనులారా వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులతో ఈ సముద్రతీర పట్టణం కిక్కిరిసిపోయింది.

108 కుండల సుగంధ జలాలతో మహా స్నానం

ప్రసిద్ధ వార్షిక పూరీ రథయాత్రకు (Rath Yatra) ముందస్తుగా ఈ స్నాన యాత్రను నిర్వహించడం ఆనాదిగా వస్తున్న ఆచారం. ఈ ప్రత్యేక పర్వదినాన శ్రీమూర్తులను గర్భాలయం (Sanctum Sanctorum) నుండి బయటకు తీసుకువచ్చి, ఆలయ ప్రాంగణంలోని ఎత్తైన ‘స్నాన బేడీ’ (Snan Bedi) పై కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య 108 కుండల పవిత్ర సుగంధ జలాలతో త్రిమూర్తులకు ఘనంగా జలాభిషేకం చేశారు. ఆలయం వెలుపల ఉన్న గ్రాండ్ రోడ్డు (బడవండా) నుండి భక్తులు ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మహా స్నానం అనంతరం స్వామివారు భక్తులకు ‘గజానన వేషం’ (ఏనుగు అవతారం) లో దర్శనమివ్వనున్నారు.

Next Story