- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం
మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి!

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘట మహారాష్ట్రలోని అమరావతి జిల్లా సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే (Samruddhi Expressway) పై చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధమన్‌గావ్ రైల్వే సరిహద్దు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా ఉండటం వల్లే ఆగి ఉన్న ట్రక్కును గమనించలేకపోయారని, ఢీకొట్టిన వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయిందని అధికారులు సోమవారం వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతుల వివరాలు సేకరిస్తున్నామని, ప్రమాదంపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నామని స్థానిక పోలీస్ అధికారి పేర్కొన్నారు.






