రాష్ట్రంలో నేరాల రేటు 14% తగ్గింది: హోంమంత్రి అనిత

by Malleboina Mahesh |

ఏపీలో 14% తగ్గిన నేరాల రేటు.. గంజాయి సాగు సున్నాకు చేర్చామని, 'ఈగల్' టాస్క్‌ఫోర్స్ ద్వారా రూ. 24 కోట్ల ఆస్తులు జప్తు చేశామన్న హోంమంత్రి అనిత!

రాష్ట్రంలో నేరాల రేటు 14% తగ్గింది: హోంమంత్రి అనిత
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా (Drugs Free AP) మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ దిశగా ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి సాగును రికార్డు స్థాయిలో సున్నాకు చేర్చగలిగామని, దీనివల్లనే రాష్ట్రంలో నేరాల రేటు (Crime Rate) ఏకంగా 14 శాతం తగ్గిందని ఆమె వెల్లడించారు.

'ఈగల్' టాస్క్‌ఫోర్స్ ఘనత

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకలించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక 'ఈగల్' (EAGLE) టాస్క్‌ఫోర్స్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని ఈ సందర్భంగా మంత్రి అనిత కొనియాడారు. ఈ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు 1.20 లక్షల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని పూర్తిగా ధ్వంసం చేశామని వివరించారు. కేవలం మత్తు పదార్థాలను పట్టుకోవడమే కాకుండా, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతరాష్ట్ర స్మగ్లర్ల నడ్డి విరుస్తూ.. వారికి చెందిన రూ. 24 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపేలా రాబోయే రోజుల్లో తనిఖీలను మరింత తీవ్రతరం చేస్తామని ఆమె హెచ్చరించారు.

Next Story