- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త ఇంటి ముందు భార్య నిరసన...
తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది.

దిశ, కమలాపూర్: తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గుండేడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన శ్రీజకి గుండెడు గ్రామానికి చెందిన డెంగు రాజుతో ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. అప్పటి నుండి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని బాధితురాలు ఆరోపించింది. వివాహ సమయంలో కట్నంగా 12 లక్షల రూపాయలు,16 తులాల బంగారం కట్నంగా అందజేశామని తెలిపింది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ అదనపు కట్నం కోసం పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పేర్కొంది. ఆన్లైన్ గేములకు అలవాటు పడి తన బంగారం తాకట్టు పెట్టి తనపై దాడి చేశాడని ఆరోపించింది తనకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తానని బాధితురాలు వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేశానని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.






