హైదరాబాద్ లో షాపింగ్ మాల్స్, లాడ్జిలకు నోటీసులిచ్చిన పోలీసులు

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ లో మహిళల భద్రతకై పోలీస్ విభాగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది.

హైదరాబాద్ లో షాపింగ్ మాల్స్, లాడ్జిలకు నోటీసులిచ్చిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో మహిళల భద్రతకై పోలీస్ విభాగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. నగరంలో ఉన్న వందకు పైగా షాపింగ్ మాల్స్, లాడ్జిలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ట్రయల్ రూమ్స్, రెస్ట్ రూమ్స్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అలాగే ప్రతీ మాల్ లో కస్టమర్ సేఫ్టీ ఇన్ ఛార్జ్ ను నియమించాలని, హిడెన్ కెమెరాలను గుర్తించే డిటెక్షన్ డివైస్‌లను ఉపయోగించాలని సూచించారు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి రికార్డులను మెయింటెయిన్ చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద డివైజ్ లు కనిపిస్తే వెంటనే తమకు చెప్పాలని షాపింగ్ మాల్స్, లాడ్జిల యజమానులకు కీలక ఆదేశాలిచ్చారు. పోలీసులు ఉద్యోగుల వెరిఫికేషన్, సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. మహిళల భద్రత, ఇతర విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story