- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మళ్లీ మల్లికార్జున ఖర్గే
రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మళ్లీ గుర్తింపు పొందిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం!

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ లోని రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మళ్లీ మల్లికార్జున ఖర్గేను తిరిగి ఎన్నుకున్నారు. దీంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మరోసారి రాజ్యసభ ప్రతిపక్ష నేతగా (Leader of Opposition) అధికారిక గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఎగువ సభకు (Rajya Sabha) తిరిగి ఎన్నికైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సోమవారం గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సమక్షంలో ఖర్గే సోమవారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
సాంకేతిక కారణాల వల్ల చిన్న విరామం..
ఖర్గే రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం జూన్ 25, 2026తో ముగిసింది. దీనివల్ల సాంకేతికంగా జూన్ 26, 2026 నుంచి ఆయన రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఆయన మళ్లీ సభకు ఎన్నిక కావడంతో, సోమవారం ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే రాజ్యసభ సెక్రటేరియట్ ఆయనను తిరిగి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సభలో సీనియర్ నేతగా, అనుభవజ్ఞుడిగా ఉన్న ఖర్గే మళ్లీ అదే స్థానంలో బాధ్యతలు చేపట్టడంపై కాంగ్రెస్, ఇండియా (INDIA) కూటమి భాగస్వామ్య పక్షాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.






