- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘టవర్ ఉంది.. సిగ్నల్ లేదు’.. జియో సేవలపై గ్రామస్తుల వినూత్న నిరసన
ఊరిలోనే సెల్‌టవర్ ఉన్నా చెట్లు ఎక్కవలిసిందేనని, సిగ్నల్ కరువైందంటూ సత్తనపల్లి గ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు.

దిశ, ఖానాపూర్ : ఊరిలోనే సెల్‌టవర్ ఉన్నా చెట్లు ఎక్కవలిసిందేనని, సిగ్నల్ కరువైందంటూ సత్తనపల్లి గ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. జియో నెట్‌వర్క్ సేవలు అధ్వానంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం టవర్ కిందే గుమిగూడి, ఫోన్లు పైకెత్తి సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రదర్శన నిర్వహించారు. గత మూడు నెలలుగా గ్రామంలో కరెంటు నిలిచిపోయిన ప్రతిసారీ జియో నెట్‌వర్క్ పూర్తిగా మూగబోతోందని వినియోగదారులు మండిపడ్డారు. అత్యవసర సమయంలో కాల్ చేయలేక, ఆన్‌లైన్ క్లాసులు, యూపీఐ చెల్లింపులు, ప్రభుత్వ సేవల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
రీఛార్జీలకు నెలనెలా డబ్బులు కడుతున్నాం. కానీ కరెంటు పోతే టవర్ కూడా కుప్పకూలుతుంది. అనారోగ్యంతో అంబులెన్స్‌కు ఫోన్ చేయాలన్నా సిగ్నల్ దొరకని దుస్థితి అని గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్ కేర్‌కు పదుల సంఖ్యలో ఫిర్యాదు చేసినా కంపెనీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టవర్‌కు 24 గంటల విద్యుత్ సరఫరా కల్పించాలని, జనరేటర్ లేదా బ్యాటరీ బ్యాకప్ ఏర్పాటు చేసి నిరంతర నెట్‌వర్క్ సేవలు అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కరించకపోతే గ్రామంలోని జియో వినియోగదారులంతా మూకుమ్మడిగా ఇతర నెట్‌వర్క్‌లకు మారిపోతామని హెచ్చరించారు. సెల్‌టవర్ కిందే సిగ్నల్ కోసం ఫోన్లు ఎత్తిపట్టి చేసిన ఈ వినూత్న నిరసన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. జియో యాజమాన్యం వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.






