- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివరి నిమిషంలో CM రేవంత్ రెడ్డి సభ రద్దు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేపు (మంగళవారం) ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరగాల్సిన 'రైతు ఆశీర్వాద సభ' రద్దయింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేపు (మంగళవారం) ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరగాల్సిన 'రైతు ఆశీర్వాద సభ' రద్దయింది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయకుండా, ప్రత్యామ్నాయంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ సభను 'రైతు భరోసా పంపిణీ సదస్సు'గా నిర్వహించనున్నట్లు పేర్కొంటూ, దీనికి సంబంధించిన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
రేపు సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం..
శిల్పకళా వేదికలో రేపు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రతిష్టాత్మక సమావేశం ప్రారంభం కానుంది. మధిర సభ రద్దయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఇందులో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇందులో భాగంగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలోని రైతులు తమ పరిసర ప్రాంతాల్లోని 'రైతు వేదికల' నుంచీ డిజిటల్/ వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.






