దిక్కూ మొక్కూ లేని వృద్ధురాలికి న్యాయం చేయండి సారూ..!

by Batti.Sumithra |

నా ఒక్కగానొక్క కొడుకు పఠాన్ ఖయ్యాంను పోలీసు ఇన్‌ఫార్మర్ అని నింద వేసి, టేకులపల్లి మండలం సంపత్‌నగర్ గ్రామంలో 2021 ఆగస్టు నెలలో నక్సలైట్లు కాల్చి చంపేశారు.

దిక్కూ మొక్కూ లేని వృద్ధురాలికి న్యాయం చేయండి సారూ..!
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : నా ఒక్కగానొక్క కొడుకు పఠాన్ ఖయ్యాంను పోలీసు ఇన్‌ఫార్మర్ అని నింద వేసి, టేకులపల్లి మండలం సంపత్‌నగర్ గ్రామంలో 2021 ఆగస్టు నెలలో నక్సలైట్లు కాల్చి చంపేశారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నా ఇంటికి వచ్చి ఓదార్చారు. నాకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని, తన కుటుంబ దుర్భర పరిస్థితులను తెలుసుకుని ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఐదేళ్లుగా క్రమం తప్పకుండా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మృతుడి తల్లి పఠాన్ ఖాజా బేగం కలెక్టర్ అనికిత్ ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. ప్రస్తుతం తనకు బ్రతకడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించక నా కూతురు వద్ద ఉంటున్నానని, నా ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన కలెక్టర్ ఈ అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Next Story