మున్సిపల్ సమావేశంలో రచ్చ రచ్చ.. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అంటూ ప్రజాప్రతినిధుల పరస్పర దూషణలు!

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-29 06:23:05  IST  )

మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రచ్చ రచ్చగా మారింది.

మున్సిపల్ సమావేశంలో రచ్చ రచ్చ.. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అంటూ ప్రజాప్రతినిధుల పరస్పర దూషణలు!
X

దిశ, నల్లగొండ బ్యూరో: మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రచ్చ రచ్చగా మారింది. రెండో డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య తన వార్డులో ఉన్న సమస్యలను సమావేశానికి స్పష్టంగా బ్యానర్‌ను ప్రదర్శించారు. సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశించి మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రత్యక్ష కార్పొరేటర్ ఎదురు దాడికి దిగారు. ఒక భాషలో నువ్వు ఎంత అంటే.. నువ్వు ఎంత అంటూ దూషణలు చేసుకున్నారు. పదినిమిషాలు ఒక్కసారిగా సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే కొంతమంది కార్పొరేటర్లు , పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు. పాలకవర్గం గెలిచి 5 నెలలు దాటిన అతను అభివృద్ధికి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించలేదని పార్టీలు సమావేశంలో నిలదీశారు.

Next Story