- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరొకరు అరెస్ట్
రాష్ట్రంలో సంచలనానికి దారితీసిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు తాజాగా మరొకరిని అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనానికి దారితీసిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు తాజాగా మరొకరిని అరెస్ట్ చేశారు. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును సిట్ అరెస్ట్ చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ కు సంబంధించి ఆయన్ను సుదీర్ఘంగా విచారించిన అనంతరం.. అతని మరణంలో కానిస్టేబుల్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించింది. నేడు కానిస్టేబుల్ ను కోర్టులో హాజరు పరిచి.. కస్టడీకి కోరనుంది.
కాగా.. నేడు సాయికృష్ణ మిస్సింగ్ కేసు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. తన కొడుకు కనిపించడం లేదని గతంలోనే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా.. సాయికృష్ణను కోర్టులో హాజరు పరచాలని గతంలోనే పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నేడు ఆమె పిటిషన్ విచారణకు రానుంది. కాగా.. ఇప్పటికే సాయికృష్ణ మిస్సింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. అధికారులు విచారణ చేయగా అతనిది లాకప్ డెత్ అని తేలింది. తీవ్రంగా కొట్టడం వల్ల సాయికృష్ణ మరణించినట్లు తేలడంతో.. సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేయగా.. మిస్సింగ్ కేసు లాకప్ డెత్ కేసుగా మారింది.






