మూసీ ప్రాజెక్ట్ నుండి సాగునీరు విడుదల చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

by Malleboina Mahesh |

మూసీ ప్రాజెక్ట్ కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం.. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేమన్న విప్!

మూసీ ప్రాజెక్ట్ నుండి సాగునీరు విడుదల చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం
X

దిశ, వెబ్ డెస్క్: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు (Musi project) వద్ద సాగునీటి విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎడమ, కుడి కాల్వల ద్వారా దిగువకు సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమయానికి సాగు నీరు అందడం వల్ల మూసీ ఆయకట్టు ఈ పరిధిలోని వేలాది ఎకరాలకు పంట నీరు అందుతుందని, రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సంతోషంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, పేదల జీవనోపాధి కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే వీరేశం పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు ఇండ్లు, రేషన్ కార్డులు అందకుండా తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పరమావధిగా పెట్టుకుని పనిచేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నమ్మకంతో ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

Next Story