- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంతల రోడ్డుపై కదిలిన భువనగిరి ఎంపీ.. అధికారుల తీరు పై సీరియస్
అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న బచ్చన్నపేట - కొడవటూర్ ప్రధాన రహదారి దుస్థితిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

దిశ,బచ్చన్నపేట: అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న బచ్చన్నపేట - కొడవటూర్ ప్రధాన రహదారి దుస్థితిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గత కొంతకాలంగా దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా పగుళ్లు తేలి, చెరువులను తలపించేలా భారీ గుంతలతో దర్శనమిస్తోంది. నిత్యం వందలాది మంది వాహనదారులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఈ నరకప్రాయమైన రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ఎంతోమంది ఇక్కడి గుంతల వల్ల ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్న, రహదారుల శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎంపీ నివాసంలో విన్నపం.. తక్షణమే స్పందన!ప్రజల పడుతున్న అవస్థలను చూసి చలించిపోయిన స్థానికులు, ప్రజా ప్రతినిధి పిన్నింటి స్టాన్లీ ఉదయాన్నే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని వారి గృహం వద్ద కలిసి రోడ్డు దారుణమైన పరిస్థితిని వివరించారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఎంపీ, తక్షణమే అక్కడికక్కడే రోడ్డు భవనాల శాఖ డివిజనల్ ఇంజనీర్(DE) కి ఫోన్ చేసి గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. "ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఏం చేస్తున్నారు?" అంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని, యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి గుంతలమయమైన రోడ్డుకు శాశ్వత విముక్తి ప్రసాదించాలని ఎంపీ కరాఖండిగా చెప్పారు. ఎంపీ గారి తక్షణ స్పందన చూసైనా నిద్రమత్తులో ఉన్న అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పనులు పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.






