ఆ పదం అంటేనే నాకు అలర్జీ.. ఆ ట్యాగ్‌లైన్ లేకుండానే వారు సక్సెస్ అయ్యారు.. నందిని రెడ్డి

by Pulgam srinivas |

సినిమా విజయాన్ని నిర్ణయించేది ట్యాగ్ కాదు, బలమైన కంటెంట్" అని నందిని రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆ పదం అంటేనే నాకు అలర్జీ.. ఆ ట్యాగ్‌లైన్ లేకుండానే వారు సక్సెస్ అయ్యారు.. నందిని రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారిలో నందిని రెడ్డి ఒకరు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 'పాన్ ఇండియా' ట్యాగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందిని రెడ్డి మాట్లాడుతూ, "నాకు 'పాన్ ఇండియా' అనే పదం అంటేనే అలర్జీ. ఇప్పుడు ఆ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ అలాంటి ట్యాగ్‌లు లేని రోజుల్లోనే అల్లు అర్జున్ మలయాళ ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందుతూ 'మల్లు అర్జున్'గా గుర్తింపు సంపాదించారు" అని అన్నారు.

అలాగే, 'పుష్ప' సినిమాను మొదట కేవలం తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారని, తర్వాత రాజమౌళి సూచన మేరకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారని తెలిపారు. "సినిమాలో బలమైన కంటెంట్ ఉంటే అది సహజంగానే అన్ని భాషల ప్రేక్షకులను చేరుకుంటుంది. కేవలం 'పాన్ ఇండియా' అనే ట్యాగ్‌తో మాత్రమే సినిమా పెద్ద విజయాన్ని సాధించదు. అందుకే నాకు ఆ పదం అంటే అలర్జీ" అని నందిని రెడ్డి పేర్కొన్నారు. ఇక ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణతో పాటు విజయాన్ని కూడా అందుకుంది.

Next Story