- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అస్సాంలో వరద బీభత్సం.. మునిగిపోయిన 100కు పైగా గ్రామాలు
అరుణాచల్ వర్షాలతో అసోంలో వరద బీభత్సం.. జోనాయ్ సరిహద్దుల్లో 100కు పైగా గ్రామాలు జలమయం, కొట్టుకుపోయిన వందలాది పశువులు!

దిశ, వెబ్ డెస్క్: అస్సాంకు పొరుగు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న కుంభవృష్టి (Aquarius) కారణంగా అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులతో అసోం-అరుణాచల్ సరిహద్దు ప్రాంతమైన జోనాయ్ తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. నదీ ప్రవాహాలు ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పటివరకు 100కు పైగా గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూములు, ఇళ్ళు, రోడ్లు, ఇతర ఆస్తులు జలమయమయ్యాయి. ఈ ఊహించని వరద ఉధృతికి పెద్ద సంఖ్యలో పశువులు నీటిలో కొట్టుకుపోయి మరణించినట్లు సమాచారం అందుతోంది.
బాహీర్ చిలే, బాహీర్ జోనాయ్ లపై తీవ్ర ప్రభావం..
ప్రస్తుత వరదల వల్ల బాహీర్ చిలే, బాహీర్ జోనాయ్ గ్రామ పంచాయతీలు అత్యంత ఘోరంగా దెబ్బతిన్నాయి. బాహీర్ చిలే పంచాయతీ పరిధిలోని సుమారు 40 గ్రామాలు, అలాగే బాహీర్ జోనాయ్ పంచాయతీ పరిధిలోని 60కి పైగా గ్రామాలు పూర్తిగా వరద గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. వేలాది మంది ప్రజలు ఇళ్లు కోల్పోయి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో చేరుకుని బాధితులను రక్షించేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. కాగా ఈ వరదలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సీఎం హిమంత బిశ్వ శర్మతో మాట్లాడి, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.






