- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా వ్యాప్తంగా జోరు వాన.. రైతుల్లో చిగురించిన ఆశలు
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురిసింది.

దిశ, నందిపేట: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురిసింది. ఆదివారం రాత్రి అత్యధికంగా జానకంపేటలో 84.50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే సిరికొండలో 78.5, మోస్రాలో 78.50, తూంపల్లిలో 76.8, ధర్పల్లిలో 75.5, చీమనపల్లిలో 69.0, చందూర్‌లో 66.4, ఎడపల్లిలో 64.5, నవీపేట్‌లో 64.0, కోరట్పల్లిలో 55.8, మచ్చర్లలో 53.3, బెల్లాల్‌లో 50.3, మగ్గిడిలో 48.2, రెంజల్‌లో 42.2, మాక్లూర్‌లో 41.0, వేంపల్లిలో 39.8, డిచ్పల్లిలో 36.5, మల్కాపూర్‌లో 34.5, పెర్కిట్లో 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనూ సాధారణ వర్షపాతం కురిసింది. ఈ సీజన్ ప్రారంభమైన నెల రోజుల తర్వాత ఆదివారం రాత్రి కురిసిన వర్షపాతమే అత్యధికం కావడం గమనార్హం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. ఎండిపోతున్న నారుమడులకు ఆరుతడి పంటలకు జీవం వచ్చి పడింది. అంతంతమాత్రంగానే పోస్తున్న బోరుబావులకు జీవకళ వస్తుందని అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు.






